12th Fail సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యాక్టర్ విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ షేర్ చేశారు. కొన్నేళ్లుగా అందరి నుండి అసాధారణమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ తనకు సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన టైం వచ్చిందన్నారు. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇన్నాళ్లు నాపై ప్రేమ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా ఫ్యామిలీకి సమయం కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.x
- December 2, 2024
0
126
Less than a minute
You can share this post!
editor


