నేడు సిల్క్‌ స్మిత జయంతి.. గ్లింప్స్ రిలీజ్

నేడు సిల్క్‌ స్మిత జయంతి.. గ్లింప్స్ రిలీజ్

సినిమా అంటే ఇష్ట‌ప‌డే ప్ర‌తీ ఒక్క‌రికి సిల్క్ స్మిత డ్యాన్స్‌లు అంటే పడిచచ్చేవారున్నారు. 80ల‌లో అగ్ర‌హీరోల‌తో క‌లిసి న‌టించి త‌న హాట్ హాట్ అందాల‌తో ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపింది. కైపెక్కించే క‌ళ్ల‌తో మత్తెక్కించే అందంతో కుర్ర‌కారు గుండెల్ని దోచేసింది. సిల్క్ స్మిత ఉందంటే చాలు ఆ సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురవాల్సిందే. అయితే సిల్క్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో మరో బయోపిక్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. సిల్క్ స్మితది క్వీన్ ఆఫ్ ది సౌత్ అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా.. చంద్రికా రవి సిల్క్ పాత్ర‌లో న‌టించ‌బోతోంది. ఈ చిత్రంతో జయరామ్‌ అనే కొత్త దర్శకుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు. కాగా నేడు సిల్క్‌ స్మిత జయంతి. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. 80ల‌లో సిల్క్ స్మిత త‌న న‌ట‌న‌తో ఎంత పాపుల‌ర్ అయ్యిందో చూడ‌వ‌చ్చు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతో పాటు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

editor

Related Articles