Movie Muzz

నటి కస్తూరి ప్రజల మంచికోరే వ్యాఖ్యలు..

నటి కస్తూరి ప్రజల మంచికోరే వ్యాఖ్యలు..

తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా చెప్పక్కర్లేని సినీ యాక్టర్, టీవీ సీరియల్స్ నటి కస్తూరి. తమిళనాడు బీజేపీ నాయకురాలైన కస్తూరి తాజాగా బీజేపీ సభలో ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీని ప్రశ్నించే క్రమంలో తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ.. తెలుగు ప్రజలపై చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజుల కాలంలో అంతఃపురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళజాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపురంలో పనిచేసేందుకు వచ్చిన తెలుగువారు తమిళనాడుకు చెందినవారే. ప్రస్తుతం తమిళనాడులో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మిన్స్  చెబుతున్నారు. ఇది ఒక మంచి పరిణామమే కదా.

administrator

Related Articles