పాటల రచయిత అనంతశ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఐఫా అవార్డును దక్కించుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య తారలుగా సాయిరాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బేబీ’ (2023) సినిమా కోసం అనంతశ్రీరామ్ రాసిన ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అనంతశ్రీరామ్‌ని అభినందిస్తూ ‘బేబీ’ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకుల రివార్డులతోపాటు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ‘బేబీ’ని వరిస్తున్నాయంటే.. ఈ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడు సాయిరాజేష్‌కే దక్కుతుందని నిర్మాత కొనియాడారు. సాయిరాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అవుతున్న విషయం మీకు తెలుసా.

- November 4, 2024
0
24
Less than a minute
Tags:
You can share this post!
administrator