చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కాకుండా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అభిమానులతో పాటు సినీ లవర్స్ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ఇక చిరంజీవి వెండితెర పైకి రాకముందు రంగస్థలం మీదా నాటకాలు వేసిన విషయం తెలిసిందే. అయితే రంగస్థలం మీద తాను వేసిన తొలి నాటకమే తనకు ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకువచ్చింది అంటూ 50 ఏళ్ల నాటి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘రంగస్థలం’ మీద నా తొలి నాటకం ‘రాజీనామా‘. నర్సాపుర్లోని వైఎన్ఎమ్ కాలేజీలో ఈ నాటకం వేయడం జరిగింది. కోన గోవింద రావు రచనలో నా తొలి గుర్తింపు పొందిన నాటకం ఇది. ఈ నాటకంలో నటన వలన ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాను. యాక్టర్ అవ్వాలన్న కోరిక ఇక్కడినుండే మొదలైంది. ఈ నాటకం వేసి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ చిరు జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
- October 26, 2024
0
114
Less than a minute
Tags:
You can share this post!
administrator
Related Articles
prev
next

