తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న బ్యానర్ పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలనే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటోంది. ప్రొడ్యూసర్ TG విశ్వప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్, జీ2తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యానర్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘రణమండల’. ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి కథతో మైథాలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటీనటులు, దర్శకుడికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.

- October 26, 2024
0
35
Less than a minute
Tags:
You can share this post!
administrator