సినిమా వేడుకల్లో సాయిపల్లవి కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కి వేరే సెలబ్రిటీలతో పనుండదు. ఆ వేడుక అంతా సాయిపల్లవి జపమే. ఆడియన్స్‌కే కాదు, వేదికపై ఉండే సెలబ్రిటీలకు కూడా సాయిపల్లవి జపమే.. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నయ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా, హీరో శివకార్తికేయన్ నుండి అతిథిగా విచ్చేసిన లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం వరకూ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. మణిరత్నం అయితే.. ఒకడుగు ముందుకేసి, నేను సాయిపల్లవి అభిమానిని. ఆమెతో సినిమా చేయాలనుంది. తప్పకుండా చేస్తా.. అని వేలాదిమంది ఫ్యాన్స్ మధ్య మాటల ధోరణిలో చెప్పేశారు. సాధారణంగా మణిరత్నం డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలని హీరోయిన్లందరూ కలలు కంటుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇక ‘అమరన్’ సినిమా విషయానికొస్తే.. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా, కథలో కీలకమైన ఆయన భార్య పాత్రను సాయిపల్లవి పోషించింది.
- October 20, 2024
0
133
Less than a minute
Tags:
You can share this post!
administrator


