హృతిక్‌, తారక్‌ మధ్య గొప్ప డ్యాన్సింగ్ ‘వార్ 2’

హృతిక్‌, తారక్‌ మధ్య గొప్ప డ్యాన్సింగ్ ‘వార్ 2’

దేవర హడావిడి ప్రస్తుతానికి తగ్గింది. ఇప్పుడు తారక్‌ దృష్టి అంతా ‘వార్‌ 2’ సినిమా మీదే. అందుకే.. లుక్‌, స్టైల్ మార్చేశాడు. రీసెంట్‌గా ‘వార్‌ 2’ కోసం ముంబై ఫ్లయిట్‌ ఎక్కేశాడు. ప్రస్తుతం తారక్ ముంబైలో బిజీ బిజీగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ కొత్త షెడ్యూల్‌లో హృతిక్‌, తారక్‌లపై ఓ పాటను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్నారట. హృతిక్‌, తారక్‌ ఇద్దరూ గొప్ప డ్యాన్సర్సే. అందుకే.. అబ్బురపరిచే డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఈ పాటను డిజైన్‌ చేశారట. ప్రస్తుతం ముంబైలో ఈ పాట షూటింగ్‌ జరుగుతోంది. డ్యాన్స్‌ లవర్స్‌ పండుగ చేసుకునేలా ఈ పాట ఉండేలా ప్లాన్ చేశారుట. ఇప్పటికే తారక్‌, హృతిక్‌లపై భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని కూడా కంప్లీట్ చేశారు. ఓ వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది ఆగస్ట్‌ 14న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ పెడదామనుకుంటున్నారు. పాన్‌ ఇండియా సినిమాలు అన్నీ ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లో విడుదల చేస్తున్న కాలంలో ఉన్నాము. అయితే.. తారక్‌ది ఇందులో వన్‌ ఆఫ్‌ ది లీడ్‌ రోల్‌ కాబట్టి, ఆయన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు టైటిల్‌ పెట్టాలని మేకర్స్‌ భావిస్తున్నారనేది బీటౌన్‌ టాక్‌. నిజానికి ‘యుద్ధభూమి’ ఇక్కడ కొత్త టైటిలేం కాదు. గతంలో చిరంజీవి హీరోగా చేసిన ఇదే పేరుతో ఓ సినిమా వచ్చింది. ‘వార్‌ 2’ అనేది కూడా యూనివర్సల్‌ టైటిల్‌. ఫైనల్‌గా అదే ఫిక్స్ అయ్యే అవకాశం ఉండవచ్చు.

administrator

Related Articles