ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక ఫ్యాన్స్ మీట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రోలింగ్, విమర్శలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ప్రతి ఒక్కరికీ సమయం, శక్తి ఎంతో విలువైనవి. అవి మనకు నచ్చిన పనుల కోసం వినియోగించాలి. ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టొద్దు. నచ్చలేదా… వదిలేయండి” అని అల్లు అర్జున్ సూచించారు.
అలాగే, నచ్చని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, మనకు ఆనందం కలిగించే విషయాలపై దృష్టి పెట్టాలని అభిమానులకు సూచించారు. తనదైన శైలిలో చెప్పిన ఈ సందేశం అభిమానులను ఆకట్టుకుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది లేదా 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

