దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ప్రముఖ ప్రాంతం పోయెస్ గార్డెన్లో ఆమె కొత్త లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విల్లా విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్ తదితర ప్రముఖులు నివసించే హై- సెక్యూరిటీ ప్రాంతంలో ఈ విల్లాను నయనతార సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆమె, త్వరలోనే భర్త విఘ్నేశ్ శివన్, పిల్లలతో కలిసి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నట్లు టాక్.
ఇక సినిమాల విషయానికి వస్తే, నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఆమె, దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.
అయితే, రూ.40 కోట్ల విల్లా కొనుగోలుకు సంబంధించి నయనతార లేదా ఆమె బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తపై స్పష్టత రావాల్సి ఉంది.

