విజయ్ మూవీకి ఆశించిన కలెక్షన్లు లేవు

విజయ్ మూవీకి ఆశించిన కలెక్షన్లు లేవు

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి సినిమా ‘జన నాయగన్’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగనున్న విజయ్ చివరి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్‌లో తొలి రోజు ఈ సినిమా సుమారు రూ.41 కోట్ల నెట్, రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ రెండు భాషల్లో కలిపి కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. అయితే ఓవర్సీస్‌లో సినిమా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఉత్తర అమెరికా ప్రీమియర్లతో కలిపి 2 మిలియన్ డాలర్లకు పైగా, ఇతర దేశాల్లో మరో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా విదేశాల్లో 3.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.78.27 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా, విజయ్ చివరి సినిమా కావడంతో అంచనా వేసిన రూ.100 కోట్ల ఓపెనింగ్ మార్కును అందుకోలేకపోయింది. అలాగే విజయ్ గత సినిమాలు ‘లియో’, ‘గోట్’, ‘బీస్ట్’ తొలి రోజు వసూళ్ల కంటే కూడా తక్కువ ఓపెనింగ్ నమోదు చేసింది.

Related Articles