‘సామజవరగమన’ వంటి సూపర్‌హిట్ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో ఆసక్తికర సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్‌పై నెలకొన్న ఉత్కంఠకు చిత్రబృందం తెరదించింది. నటి సాక్షి మడోల్కర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రత్యేక వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది.
రోషన్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మోగ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి మడోల్కర్, ఇప్పుడు శ్రీ విష్ణు సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘సామజవరగమన’ సినిమాకి కథ, మాటలు అందించిన భాను బోగవరపు, నందు సావిరిగణ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియోతో సాక్షి మడోల్కర్ ఎంట్రీ అధికారికంగా ఖరారవడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

