చిరంజీవి మూవీకి కొత్త రిలీజ్ ప్లాన్?

చిరంజీవి మూవీకి కొత్త రిలీజ్ ప్లాన్?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న భారీ సినిమాపై ఆసక్తికర ప్రచారం టాలీవుడ్‌లో వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మేకర్స్ పునఃపరిశీలిస్తున్నట్లు టాక్. సంక్రాంతి సీజన్‌లో పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో థియేటర్ల పోటీ, కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమాను సోలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అందుకే సమ్మర్ లేదా మరో అనుకూలమైన పండుగ సీజన్‌లో విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి– బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్‌ను ఎంచుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ప్రచారాలపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో చిరంజీవి సినిమా నిజంగానే సంక్రాంతి బరిలో ఉంటుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles