టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆమెకు ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ సీమంతం నిర్వహించినట్లు సమాచారం. సంప్రదాయ పద్ధతిలో కొత్త దుస్తులు అందించి, స్వీట్లు తినిపించి ఆశీర్వదించడంతో ఈ వేడుక భావోద్వేగంగా సాగింది. ఈ సర్‌ప్రైజ్‌ను ఊహించని సమంత ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ నిడిమోరు కూడా ఈ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించినట్లు సమాచారం.
వేడుకలో సమంత, రాజ్ ఇద్దరూ ఒకే రంగు మెరూన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సమంత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటీవల సమంత గర్భధారణపై వార్తలు వినిపిస్తుండగా, ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ కార్యక్రమంలో ఆమె బేబీ బంప్‌తో కనిపించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం షూటింగ్‌లకు విరామం ఇచ్చిన సమంత కుటుంబంతో కలిసి ఈ ప్రత్యేక సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

