రూమర్లకు చెక్.. పవన్ చికిత్సపై స్పష్టత

రూమర్లకు చెక్.. పవన్ చికిత్సపై స్పష్టత

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్సకు ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నారనే ప్రచారాన్ని పవన్ బృందం ఖండించింది. భుజం చికిత్సతో పాటు గతంలో జరిగిన ముక్కు శస్త్రచికిత్స ఖర్చులను కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా భరించారని స్పష్టం చేసింది. ప్రభుత్వ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వ్యక్తిగత వైద్య ఖర్చులను సొంతంగానే చెల్లించినట్లు తెలిపింది. మరోవైపు పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య అనా లెజినోవా కీలక అప్డేట్ ఇచ్చారు. పవన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, చికిత్స అందించిన వైద్య బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ల సూచన మేరకు పవన్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రాజకీయ కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ 2’ సినిమాని త్వరలోనే ప్రారంభించే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related Articles