ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ టోర్నమెంట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్ని రిఫరీ నిర్ణయాలు తనకు నచ్చలేదని, అవి ఏకపక్షంగా ఉన్నట్లు అనిపించాయని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘‘అర్ధరాత్రి, తెల్లవారుజామున మ్యాచ్‌లు ప్రసారం కావడంతో నా రోజువారీ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. అయినా ఒక్క మ్యాచ్‌ను కూడా మిస్ కావడం లేదు. అయితే కొన్ని రిఫరీ నిర్ణయాలు న్యాయంగా అనిపించడం లేదు. అదే నాకు అసంతృప్తిగా ఉంది’’ అని అమితాబ్ తెలిపారు.
అలాగే ఈ టోర్నీలో పెద్దగా అంచనాలు లేని జట్లు విజయాలు సాధించడం ఆనందంగా ఉందని, బలమైన జట్లు ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఫిఫా వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. నేడు స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండు బలమైన జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

