వినాయకన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదు

వినాయకన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదు

మలయాళ నటుడు, ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్న వినాయకన్‌పై కేరళ కోర్టులో కేసు నమోదైంది. మహిళలను అవమానించేలా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో అలప్పుజ జిల్లా మావెలిక్కర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మైనర్ బాలిక ఫొటోను ఆమె అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. తన ఎనిమిదేళ్ల కుమార్తె ఫొటోను వినాయకన్ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆయన ఆరోపించారు. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం, గతంలో వినాయకన్‌కు సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పోస్టును తాను వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేశానని, దానిపై నటుడు ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిపాడు. అనంతరం తన వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో ఉన్న కుమార్తె ఫొటోని స్క్రీన్‌షాట్ తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారని ఆరోపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వినాయకన్ నుంచి ఈ ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Related Articles