మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న DQ41 చిత్రానికి ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన పోస్టర్‌లో దుల్కర్, పూజా హెగ్డే జోడీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమాకి “Love Will Spark Again” (ప్రేమ మళ్లీ చిగురిస్తుంది) అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
రవి బాబు నెలకుడితి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

