‘వారణాసి’ అప్‌డేట్‌కు కౌంట్‌డౌన్

‘వారణాసి’ అప్‌డేట్‌కు కౌంట్‌డౌన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్- వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఆగస్టు 9న మహేష్ బాబు రాముడి గెటప్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమా మోషన్ టీజర్‌లో రామాయణానికి సంబంధించిన అంశాలను స్వల్పంగా చూపించినప్పటికీ, మహేష్ లుక్‌ను మాత్రం పూర్తిగా గోప్యంగా ఉంచారు.

సినిమాలో రామాయణ ఎపిసోడ్ అత్యంత కీలక ఆకర్షణల్లో ఒకటిగా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో మహేష్ రాముడి అవతారాన్ని ముందుగానే రివీల్ చేస్తారా? లేక ప్రేక్షకులకు థియేటర్లలోనే ఆ సర్‌ప్రైజ్‌ను అందిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుతం మహేష్ లుక్ విడుదలపై వస్తున్న వార్తలకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆగస్టు 9న నిజంగా ఏదైనా ప్రత్యేక అప్‌డేట్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

Related Articles