‘ఫౌజీ’ విజువల్స్ అదిరిపోయాయ్: నాగవంశీ

‘ఫౌజీ’ విజువల్స్ అదిరిపోయాయ్: నాగవంశీ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ వార్- లవ్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఫౌజీ’ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్‌ను నిర్మాత రవిశంకర్ తనకు చూపించారని, వాటిని చూసి ‘మైండ్ బ్లాక్ అయింది’ అని అన్నారు. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు త్వరగా టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం కానుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles