‘స్పిరిట్’ 70% పూర్తి?

‘స్పిరిట్’ 70% పూర్తి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ప్రభాస్‌ను కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ ఇప్పటికే 60 నుంచి 70 శాతం వరకు పూర్తయినట్లు టాక్. ప్రభాస్ డేట్లు అందుబాటులోకి రావడంతో సందీప్ రెడ్డి వంగా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్‌తో కలిసి టీ -సిరీస్ నిర్మిస్తోంది. పాన్ ఆసియా స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ పురోగతిపై వస్తున్న వార్తలు నిజమైతే, ‘స్పిరిట్’ అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles