అప్పటి నటుల కష్టాలు చెప్పిన అమితాబ్

అప్పటి నటుల కష్టాలు చెప్పిన అమితాబ్

హిందీ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన సినీ జీవితంలోని అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. నేటి తరం నటీనటులు ఒక పాత్ర కోసం చేసే ప్రిపరేషన్, పాత్రపై చూపించే అంకితభావం తనకు ఎంతో గౌరవంగా అనిపిస్తోందని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

“మా తరానికి ‘ప్రిపరేషన్’ అనే పదమే పెద్దగా తెలియదు. ఒకేసారి 10 నుంచి 15 సినిమాల్లో నటించేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో ఒక పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమై, వెంటనే మరో పాత్రలోకి మారడం సాధ్యం కాదు. అందుకే మేమంతా పూర్తిగా దర్శకులపైనే ఆధారపడేవాళ్లం. సెట్‌కు వెళ్లాక దర్శకుడు, సహాయ దర్శకుడు సన్నివేశాన్ని వివరించగానే నటించేవాళ్లం” అని తెలిపారు.

ఒకే రోజులో విభిన్న పాత్రల్లో ఎలా నటించగలిగేవారని చాలామంది అడుగుతుంటారని, కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు తప్పనిసరి అయ్యేవని చెప్పారు. “మేము చెప్పినట్లు చేయకపోతే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో లేదో అన్న భయం ఉండేది. అందుకే ఎలాంటి పాత్ర వచ్చినా చిత్తశుద్ధితో చేసి ముందుకు సాగాం” అని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ప్రస్తుత తరం నటీనటులు పాత్ర కోసం చూపుతున్న కృషి, విశ్లేషణ, అంకితభావం నిజంగా అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

Related Articles