‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ లేడీస్

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ లేడీస్

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్- ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్- అప్స్’ నుంచి మేకర్స్ తాజాగా ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఇప్పటివరకు యష్ లుక్, యాక్షన్‌ను చూపించిన చిత్రబృందం.. ఈసారి సినిమాలోని మహిళా పాత్రలను హైలైట్ చేసింది.

గ్లింప్స్‌లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లను గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్, బోల్డ్ అవతారాల్లో చూపించారు. రా అండ్ రస్టిక్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘డాడీ ఈజ్ హోమ్’ గ్లింప్స్‌లో యష్ పవర్‌ఫుల్ లుక్‌ను చూపించగా, ఇప్పుడు ఈ లేడీ గ్యాంగ్ కూడా అంతే ప్రభావవంతంగా ఉండబోతోందని కొత్త గ్లింప్స్‌తో సంకేతాలు ఇచ్చారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ పాన్- ఇండియా చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Related Articles