బుల్లిరాజు రెమ్యునరేషన్ వైరల్

బుల్లిరాజు రెమ్యునరేషన్ వైరల్

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు (రేవంత్) ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్‌లో తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించిన బుల్లిరాజు పేరు ఇంటింటా మార్మోగింది.

ఆ తర్వాత మెగాస్టార్ నటించిన ‘మనశంకర వరప్రసాద్’ చిత్రంలోనూ నటించి మరోసారి అభిమానులను అలరించాడు. ఇటీవల వెంకటేష్– అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, అందులో కూడా బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుసగా మూడోసారి నటించే అవకాశం అతడికి దక్కినట్లైంది.

ఇదిలా ఉండగా, బుల్లిరాజు పారితోషికంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా ప్రచారం ప్రకారం, అతడు ఒక్క రోజు షూటింగ్‌కు రూ.1 లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ, ఒక్క సినిమాతోనే బుల్లిరాజు క్రేజ్, అవకాశాలు గణనీయంగా పెరిగాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles