ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’ వచ్చేస్తోంది

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’ వచ్చేస్తోంది

బాలీవుడ్‌లో కల్ట్ యాక్షన్- డ్రామాగా గుర్తింపు పొందిన ‘ఆవారాపన్’ (2007) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆవారాపన్ 2’ రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌తో పాటు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ మరోసారి ‘శివం’ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

టీజర్‌లో గతాన్ని మోస్తూ జీవితానికి అర్థం వెతికే వ్యక్తిగా శివం పాత్రను భావోద్వేగంగా చూపించారు. ముఖ్యంగా “ఇస్ బార్ యే ఆవారాపన్ ఖతమ్ హోగా, యా మైన్” అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ముఖేష్ భట్ సమర్పణలో విశేష్ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనీ మ్యూజిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ మరుధర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఒరిజినల్ చిత్రంలోని హిట్ పాటలతో పాటు కొత్త సంగీతాన్ని కూడా ఈ సీక్వెల్‌లో అందించనున్నారు. ‘ఆవారాపన్ 2’ 2026 ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles