‘మా ఇంటి బంగారం 2’లో సాయిపల్లవి..?

‘మా ఇంటి బంగారం 2’లో సాయిపల్లవి..?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, సమంత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలో నిర్మాత రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. రెండో భాగానికి కథా లైన్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

దీంతో ‘మా ఇంటి బంగారం 2’పై ఆసక్తి నెలకొంది. తొలి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తారా? లేక ప్రీక్వెల్‌గా రూపొందిస్తారా? అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో సమంత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకునే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో ఆమె సీక్వెల్‌లో నటిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం తొలుత సాయిపల్లవినే సంప్రదించినట్లు గతంలో రాజ్ నిడిమోరు వెల్లడించిన విషయం మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లో ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా సమంతను ఎంపిక చేసినట్లు చెప్పారు. దీంతో రెండో భాగంలో సాయిపల్లవి నటించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Related Articles