అల్లు అరవింద్ క్లాప్‌తో ప్రారంభమైన కొత్త సినిమా.. హీరో హీరోయిన్లు ఎవరంటే?

అల్లు అరవింద్ క్లాప్‌తో ప్రారంభమైన కొత్త సినిమా.. హీరో హీరోయిన్లు ఎవరంటే?

మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బన్నీ వాస్ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత సందీప్ రామినేని (శాండి) మాట్లాడుతూ, మీరా ప్రొడక్షన్స్ తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని తెలిపారు. దర్శకురాలు గీత సి. శేఖర్ ఫన్‌తో పాటు ఎమోషనల్ టచ్ కలిగిన కథను సిద్ధం చేశారని చెప్పారు. మౌర్య, తన్వి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు వెల్లడించిన నిర్మాత, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

Related Articles