‘నాగబంధం’ బ్యూటీ కొత్త లుక్ చూశారా.. ఫ్యాన్స్ ఫిదా!

‘నాగబంధం’ బ్యూటీ కొత్త లుక్ చూశారా.. ఫ్యాన్స్ ఫిదా!

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చీరకట్టులో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో స్టార్‌డమ్ సంపాదించిన నభా, ప్రస్తుతం ‘స్వయంభూ’, ‘నాగబంధం’ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మైథాలజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’లో పార్వతి పాత్రలో నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల లంగావోణిలో సంప్రదాయ దుస్తుల్లో ఆమె చేసిన ఫొటోషూట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు ఎలిగెంట్ లుక్‌తో కనిపించిన నభాపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక ప్రమాదం కారణంగా కెరీర్‌లో వచ్చిన విరామం తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న నభా నటేష్, ఈ రెండు భారీ ప్రాజెక్టులతో మరోసారి టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘నాగబంధం’, ‘స్వయంభూ’ విజయాలు ఆమె కెరీర్‌కు కీలక మలుపు అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles