అక్టోబర్ 16న ‘జైలర్ 2’ రిలీజ్?

అక్టోబర్ 16న ‘జైలర్ 2’ రిలీజ్?

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తాజాగా సినీ వర్గాల తెలిపిన సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ను అక్టోబర్ 16న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తొలి భాగం మాదిరిగానే ఈ సీక్వెల్‌లోనూ పలువురు స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీతో పాటు ఇతర వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles