ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ప్రవీణ్ నాయక్‌ను ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘పటాస్’ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన ఫైమా, తెలంగాణ యాస, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ‘జబర్దస్త్’, ‘బిగ్‌బాస్’ వంటి కార్యక్రమాల ద్వారా మరింత ప్రజాదరణ పొందింది.
జూన్ 23న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫైమా -ప్రవీణ్‌ల వివాహం సాదాసీదాగా జరిగినట్లు సమాచారం. పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫైమా భావోద్వేగ పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా ఒకరినొకరు వదల్లేదని, చివరకు భార్యాభర్తలుగా ఒక్కటయ్యామని ఆమె పేర్కొంది.
బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం, ఫైమా- ప్రవీణ్ మధ్య దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమ కొనసాగింది. ‘జబర్దస్త్’ వేదికపై వీరిద్దరూ కలిసి చేసిన స్కిట్స్‌కు మంచి ఆదరణ లభించింది. అప్పట్లోనే వీరి ప్రేమపై వార్తలు వినిపించగా, ఇప్పుడు ఆ బంధం పెళ్లి బంధంగా మారింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

