రజనీ ‘ధర్మన్’ మేకింగ్ వీడియో రిలీజ్

రజనీ ‘ధర్మన్’ మేకింగ్ వీడియో రిలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ధర్మన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ‘ది డెడ్లీ డాక్టర్’ పాత్రలో కనిపించనున్నారు. న్యాయం కోసం పోరాడే శక్తివంతమైన వైద్యుడిగా రజనీకాంత్ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం.

‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో సినిమా రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో సిమ్రన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా చిత్రబృందం ‘ది ఓజీ స్వాగ్’ అనే క్యాప్షన్‌తో టైటిల్ పోస్టర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో డాక్టర్ కోట్, స్టెతస్కోప్‌తో సీరియస్ లుక్‌లో కనిపించిన రజనీకాంత్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్, ఎమోషన్, సామాజిక అంశాల మేళవింపుతో రజనీ మార్క్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మన్’ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles