మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘చిరు158’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రబృందం, హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. పొల్లాచ్చి షెడ్యూల్‌లో కీలక యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియోలో చిరంజీవి ఇంటెన్స్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక సన్నివేశంలో చిరంజీవి నటన చూసి దర్శకుడు బాబీ కొల్లి భావోద్వేగానికి లోనయ్యారు. “జీవించేశారు అన్నయ్యా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక టాకీ పార్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
- June 23, 2026
0
8
Less than a minute
You can share this post!
editor

