ప్రభాస్‌ను రియల్ లొకేషన్లలోకి తీసుకొచ్చిన వంగా..!

ప్రభాస్‌ను రియల్ లొకేషన్లలోకి తీసుకొచ్చిన వంగా..!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన అనేక చిత్రాలు భారీ సెట్లు, గ్రీన్ స్క్రీన్‌లు, సీజీఐపై ఆధారపడగా, ‘స్పిరిట్’ కోసం వంగా పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని నిజమైన లొకేషన్లలో చిత్రీకరిస్తూ ప్రేక్షకులకు మరింత సహజమైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని విమల్ థియేటర్ పరిసరాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించగా, ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో షూటింగ్ కొనసాగుతోంది. సాధారణంగా పబ్లిక్ లొకేషన్లలో షూటింగ్‌కు దూరంగా ఉండే ప్రభాస్‌ను వంగా రియలిస్టిక్ వాతావరణంలో చూపించనున్నాడు. ప్రభాస్ రా స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత బలంగా ఆవిష్కరించే ఈ ప్రయత్నంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘స్పిరిట్’ సినిమాతో ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయి సృష్టించాలనే లక్ష్యంతో వంగా ముందుకెళ్తుండగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles