కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం వంటి కారణాలతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో మృణాల్ నటించిన సినిమా ప్రీమియర్‌కు ధనుష్ హాజరవడం, ధనుష్ సినిమా ఈవెంట్లలో మృణాల్ పాల్గొనడం అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాకుండా ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే మృణాల్ మాత్రం ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని గతంలో స్పష్టం చేసింది. ఇప్పుడు బ్రేకప్ రూమర్లు వైరల్ అవుతున్నప్పటికీ ఈ విషయంపై ధనుష్ గానీ, మృణాల్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- June 22, 2026
0
17
Less than a minute
You can share this post!
editor

