లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టయిల్’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అతి తక్కువ సమయంలోనే ఈ పాట 5 మిలియన్ వ్యూస్‌ను దాటేసి సంగీత ప్రియులు, యువత నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఎనర్జీతో నిండిన బీట్, ఆకట్టుకునే ట్యూన్, స్టైలిష్ విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సందీప్ కిషన్ తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించగా, ఫారియా అబ్దుల్లా క్లాసికల్-వెస్ట్రన్ ఫ్యూజన్ డ్యాన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు జాసన్ సంజయ్ స్టైలిష్ ఆన్‌స్క్రీన్ అప్పియరెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో ‘సిగ్మా స్టయిల్’ ప్రస్తుతం యూత్ ఫేవరెట్ సాంగ్‌గా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
- June 10, 2026
0
18
Less than a minute
You can share this post!
editor

