వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘CASTE’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఎకె జంపన్న రచన మరియు దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజా రవీందర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంత్రి నారాయణ పాత్రలో రాజా రవీందర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువాతో ఆయన లుక్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
- May 23, 2026
0
10
Less than a minute
You can share this post!
editor

