దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్‌కు చెందిన వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా లొకేషన్లలో ఈ మూవీని చిత్రీకరించారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే ఇది అత్యంత స్టైలిష్ మరియు భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆంటోని వర్గీస్, మిస్కిన్, కయాడు లోహర్, కతిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
- May 21, 2026
0
76
Less than a minute
You can share this post!
editor

