ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైంది. తాజాగా కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో కేరళ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేరళ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో అసోసియేషన్‌ను మరింత బలపర్చడం, అభిమానులకు చేరువ కావడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై డిస్కషన్స్ జరిగాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దేశంలోనే అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్‌గా ఎదుగుతోంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించిన ఏఏఎఫ్ఏ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4న సౌత్ ఇండియా స్థాయి గ్రాండ్ ఫ్యాన్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు హాజరుకానున్నారు.
- May 7, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

