శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి విడుదలైన తొలి పాట అలెల్లె అలెల్లె ప్రేక్షకులను మొదటి వినిపింపులోనే ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని ఈ పాటను లాంచ్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈ పాటకు అందమైన మెలోడీని అందించారు. మొదట సాఫ్ట్‌గా మొదలై, తర్వాత ఉత్సాహభరితమైన ట్రాక్‌గా మారే ఈ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి రాసిన సాహిత్యం ప్రేమలో ఉండే మధుర భావాలను అద్భుతంగా వ్యక్తపరుస్తోంది. జివి ప్రకాష్ కుమార్, హరి ప్రియా గాత్రాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జయకృష్ణ, రాషా జంట స్క్రీన్‌పై ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తోంది. అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కిన విజువల్స్ పాటను మరింత అందంగా తీర్చిదిద్దాయి. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ తుదిదశలో ఉండగా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
- April 29, 2026
0
113
Less than a minute
You can share this post!
editor

