మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ఒక పాట మాత్రమే మిగిలి ఉందని మేకర్స్ తెలిపారు.
ఈ సాంగ్ చిత్రీకరణ కూడా కొనసాగుతుండగా, సినిమా విడుదలపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. ముందుగా జూన్‌లో విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్, ఇప్పుడు జూన్ 25ను లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. జూన్ 4న విడుదల కుదరకపోవడంతో ఈ కొత్త తేదీపై ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే జూన్ 24 రాత్రి నుంచే ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ విడుదలకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

