టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు సరైన హిట్ దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘దేవా’, ‘రెట్రో’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఈ నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ‘జననాయగన్’, ‘హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై’, అలాగే ‘కాంచన 4’, ‘డీ క్యూ -41’ సినిమాలపై నిలిచాయి. అయితే ‘జననాయగన్’ విడుదల ఆలస్యం, లీక్ సమస్యలు సినిమాపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్ట్ గ్లింప్స్‌పై వచ్చిన నెగటివ్ టాక్ కూడా ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం పూజా హెగ్డేకు రాబోయే సినిమాలే కీలకం. ఈ సినిమాలతో ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

