చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు…?

చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు…?

తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని నటుడు-దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, తన దర్శకత్వంలో వచ్చిన ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని తెలిపారు. ప్రేక్షకుల డిమాండ్ ఉన్నప్పటికీ, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఒక్క థియేటర్ కూడా దక్కకపోవడం బాధాకరమన్నారు.

థియేటర్ వ్యవస్థ కొద్దిమంది చేతుల్లోనే ఉందని, చిన్న సినిమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. “ఇది చిన్న సినిమాలపై జరుగుతున్న అన్యాయం. అవసరమైతే లీగల్‌గా పోరాడతాను” అని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని హెచ్చరించారు.

వ్యక్తిగతంగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురవుతోందని పేర్కొంటూ, పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. “ప్లీజ్ సేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న సినిమాలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Articles