దర్శకుడు MS Raju తెరకెక్కిస్తున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ చిత్రంలో కీలకమైన ‘సింహా’ పాత్రలో Shravan Reddy ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. చీకటి, పొగతో నిండిన నేపథ్యంలో చేతిలో మండుతున్న కాగడాతో కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై సస్పెన్స్‌ను మరింత పెంచుతోంది. ఈ పాత్రలో భయం, రహస్యం, తెలియని శక్తులతో పోరాడే వ్యక్తిగా సింహా కనిపించనున్నట్టు పోస్టర్ సూచిస్తోంది.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో Kamakshi Bhaskarla మహాదేవి పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 85 రోజుల షూటింగ్, భారీ సెట్ వర్క్, 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

