“జూన్ 26 ఎందుకు స్పెషల్..?

“జూన్ 26 ఎందుకు స్పెషల్..?

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై బజ్ పెంచింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. భావోద్వేగాలు, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిళితమైన కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ఆయన కొత్త లుక్ ఆకట్టుకుంది. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచిన ఈ చిత్రం జూన్ 26, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ కానుందని టీం చెబుతోంది. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related Articles