‘యుగానికి ఒక్కడు 2’ పై డౌట్ సీక్వెల్ ఎప్పుడంటే..?

‘యుగానికి ఒక్కడు 2’ పై డౌట్ సీక్వెల్ ఎప్పుడంటే..?

తమిళ హీరో కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రం టాలీవుడ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించి కల్ట్ స్టేటస్ సంపాదించింది. ఈ క్రేజ్ దృష్ట్యా దర్శకుడు సెల్వరాఘవన్ ‘యుగానికి ఒక్కడు 2’ను ప్రకటించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. తాజాగా నటి ఆండ్రియా జెరిమియా చేసిన వ్యాఖ్యలు ఈ సీక్వెల్ పై మరింత సందేహాలను పెంచాయి. ఆమె ప్రకారం, ఈ ప్రాజెక్ట్ జరిగితే కూడా తాను అందులో భాగం కావడంలేదని స్పష్టం చేసింది. మొదటి భాగం కోసం 200 రోజులు షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించిందని ఆమె వెల్లడించింది. అయినప్పటికీ, ఆ అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా ప్లాన్ చేస్తున్న ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో ‘యుగానికి ఒక్కడు 2’ పై సస్పెన్స్ కొనసాగుతోంది.

Related Articles