“దేవగుడి” సినిమా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బెల్లం రామకృష్ణా రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషించారు. కథ స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలు, విడిపోయిన అనుబంధాల చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు స్నేహితులు ఎందుకు విడిపోతారు? వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఎలా మలుపులు తిప్పాయి? అన్నదే సినిమా ప్రధాన కథాంశం. ఫ్యాక్షన్ అంశం బ్యాక్‌డ్రాప్‌గా మాత్రమే ఉండగా, ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌పై కథ నడుస్తుంది. 11 నిమిషాల స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్, రియల్ లొకేషన్స్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మదీన్ అందించిన సంగీతం, రఘు కుంచె నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న “దేవగుడి” మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
- January 27, 2026
0
130
Less than a minute
You can share this post!
editor

