మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రానికి ‘ఇరుముడి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించిన ఆధ్యాత్మిక భావనను సూచించే ఈ టైటిల్ ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాల దుస్తుల్లో భక్తి పరవశంతో కనిపించి ఆకట్టుకున్నారు. భక్తులతో నిండిన ఊరేగింపులో ఆయన పాపను ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించడం హృద్యంగా మారింది. “కొన్ని కథలు మనల్ని ఎంచుకుంటాయి” అంటూ ఈ ప్రాజెక్ట్‌పై రవితేజ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. శివ నిర్వాణ తండ్రీ–కూతుళ్ల భావోద్వేగ బంధంతో కూడిన పవర్ఫుల్ కథను తెరకెక్కిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
- January 26, 2026
0
170
Less than a minute
You can share this post!
editor

