దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో ‘దహనం’ అనే వెబ్ సిరీస్ ను ఆర్జీవీ నిర్మాతగా తెరకెక్కించారు. అదే ఏడాది ఏప్రిల్ 14న ఆ సినిమా రిలీజైంది. ఫ్యూడలిస్టులు, మావోయిస్టుల మధ్య జరిగే పోరాటాన్ని ఆధారం చేసుకుని ఆర్జీవీ నిర్మాణ సారధ్యంలో డైరెక్టర్ అగస్త్య మంజు దీనిని రూపొందించారు. ఓ కమ్యూనిస్టు నేతను ఏ విధంగా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ఆయన కొడుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఇందులో చూపించారు. ఈ సినిమాను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు. అయితే అదంతా నిజం కాదని, తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని పేర్కొంటూ అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు.
- September 18, 2025
0
334
Less than a minute
You can share this post!
administrator

