విమాన ప్రమాదంలో క‌జిన్‌ను కోల్పోయిన 12th ఫెయిల్ న‌టుడు

విమాన ప్రమాదంలో క‌జిన్‌ను కోల్పోయిన 12th ఫెయిల్ న‌టుడు

అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు తప్ప విమానంలో ఉన్న 241 మంది మరణించారు. అయితే ఇందులో బాలీవుడ్ న‌టుడు 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే సోద‌రుడు కూడా చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై విక్రాంత్ స్పందిస్తూ.. చ‌నిపోయింది త‌న సోద‌రుడు కాద‌ని… త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ అని విక్రాంత్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌నల్ పోస్ట్ పెట్టాడు. ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన ఊహించని విషాదం నా హృదయాన్ని కలచివేసింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభుతి తెలుపుతున్నాను. ఈ బాధ నాకంటే నా అంకుల్ క్లిఫార్డ్‌ కుందర్‌కు ఇంకా ఎక్కువ. ఈ ప్ర‌మాదంలో మా మామ క్లిఫోర్డ్ కుంద‌ర్ కుమారుడు క్లైవ్ కుంద‌ర్ కూడా చ‌నిపోయాడు. అతను ఈ విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్లైవ్ నా సోదరుడు అనే వార్తలు చాలా మీడియా ఛానెల్‌లలో వస్తున్నాయి. కానీ క్లైవ్ నా సోదరుడు కాదు. వారు తమ కుటుంబ స్నేహితులు అని విక్రాంత్ రాసుకొచ్చాడు.

editor

Related Articles