అల్లు అర్జున్, అట్లీ ‘AA22xA6’(వర్కింగ్ టైటిల్) సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను బుధవారం ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా కానిచ్చేశారట. రేపో మాపో షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాకు దాదాపుగా ఏడాదిన్నరైనా పట్టొచ్చనేది సినీవర్గాల అంచనా. ఇదిలావుంటే.. ‘AA22xA6’ తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ చేయాల్సిన పౌరాణిక చిత్రం ఎన్టీఆర్‌కి వెళ్లిందనే వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే.. అట్లీ తర్వాత మరి బన్నీని డైరెక్ట్ చేసే దర్శకుడెవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం తర్వాత బన్నీ సినిమా ప్రశాంత్‌నీల్‌తో ఉంటుందట. దిల్‌రాజు బ్యానర్‌లో ప్రశాంత్‌నీల్ ఓ సినిమా చేయాల్సివుంది. బన్నీ కాల్షీట్లు దిల్‌రాజు దగ్గరున్నాయి. దీంతో.. అట్లీ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తోనే బన్నీ సినిమా ఉంటుందనేది ఇన్‌సైడ్ టాక్. మరో టాక్ కూడా ఉంది. అదేంటంటే.. ‘పుష్ప 3’. ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో సుకుమార్ బిజీగా ఉన్నారు. అన్నీ అనుకూలించి, అట్లీ-బన్నీ సినిమా, సుకుమార్ – రామ్‌చరణ్ సినిమాలు అటు ఇటుగా పూర్తయి విడుదలైతే.. ‘పుష్ప 3’ మళ్లీ పట్టాలెక్కే ఛాన్స్ కూడా లేకపోలేదు.

- June 13, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor